03-11-2025 01:58:51 AM
నిజామాబాద్, నవంబర్ 02 (విజయ క్రాంతి): నిజామాబాద్ నగరంలోని ఒకటవ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనానికి సంబంధించి నగలను విక్రయించడానికి వచ్చిన దొంగలను నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఒకటవ టౌన్ పోలీసు లు పట్టుకున్నారు. వద్ద నుండి బంగారు నగలతో పాటు. కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. చోరీ విషయమై వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన టౌన్ ఎస్సు మహేష్ విచారణ జరిపారు.
దినసరి కూలీ పని చేసే ఇస్లాంపూర్ కోజా కాలనీకి చెందిన అతర్ బైగ్ ట మీర్జా అతర్ బైగ్( వయస్సు: 21 )సంవత్సరాలు షేక్ అజ్మాద్ 24 సంవత్సరాలు, కోజా కాలనీ కి చెందిన ఈ ఇద్దరు నేరస్తులు మందు, సిగరెట్, గుట్కా వంటి చెడు అలవాట్లు బానిసై న వారు పని చేయగా వచ్చిన డబ్బులు జల్సా లకు, చెడు అలవాట్లకు సరిపోవడం లేదని ఒంటరిగా కనిపించే వారిని బెదిరించి వారిని కొట్టి వారి దగ్గర డబ్బులు లేదా ఇతర విలువైన వస్తువులు దొంగతనం తో పాటు ఇళ్ళల్లో ఊరిలో మొదలుపెట్టారు.
దొంగతనంతో దోచుకున్న డబ్బులతో జల్సాకు, చెడు అలవాట్లకు వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో, వారు గత నెల.31. ఉదయం ఎరుకలవాడ లోని ఒక ఇంటిలోకి చోర బడి బీరువా తాళంను పగలగొట్టి బంగారు ఆభరణాల తో పాటు రూ 1500/- రూపాయల నగదును ఒక ఫోన్ ను దొంగలించుకొని పారిపోయారు. ఇదిలా ఉండగా వారు దొంగలించిన సొమ్మును అమ్ముకానికై గంజిలో సంచరిస్తున్న వారిని గమనించిన పోలీసులు. ఆదివారం గంజ్ మార్కెట్ లో అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించగా, వారిని పట్టుకొని వారి వద్ద నుండి బంగారు ముక్కు పుడక ఉంగరం, వెండి కడియాలు ఒత్తులు, ఒక ఫోను స్మార్ట్ ఫోన్ పాటు 1500 రూపాయల నగదును స్వాధీ నం చేసుకున్నారు.
అనంతరం వారిని అరెస్ట్ చేశారు. వీరిపై ఇదువరకే దొంగతనాల కేసులు, హత్యాయత్నం కేసులు ఉన్నాయి. వీరిలో ఒకడు అతర్ బైగ్ నెలన్నర క్రితమే జైలు నుండి విడుదల అయ్యాడు. ఈ కేసును చేధించడం లో సీఐ రఘుపతి పర్యవేక్షణలో ముఖ్య పాత్ర వహించిన వన్ టౌన్ ఎస్సు జి. మహేష్, ఏఎస్‌ఐ షకీల్, పి సి ఎస్ గంగారం, ప్రభురాజ్ లను, ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి గారు అభినంధించారు.