మోదీకి మద్దతుగా వారణాసిలో ప్రచారం
21-05-2024 02:32 AM
మెదక్, మే 20 (విజయక్రాంతి) : ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా వారణాసి (కాశీ) పార్లమెంట్ పరిధిలోని వారణాసి అసెంబ్లీ 271 బూత్‌లో మెదక్, నిజామాబాద్ బీజేపీ నేతలు ప్రచారం నిర్వహించారు. అక్కడి తెలుగు ప్రజలతో కలిసి మోదికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. 400 ఎంపీ సీట్లతో మళ్లీ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని, మోది మూడోసారి పీఎం కావడం ఖాయమని స్పష్టం చేశారు. ప్రచారంలో మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, నిజామాబాద్ ఎమ్మెల్యే దన్పాల్ సత్యనారాయణ, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు విక్రంరెడ్డి, స్థానిక నాయకులు గజానంద్ జ్యోషి, మహేశ్ పాల్గొన్నారు.






