27 August, 2026 | 2:10 AM

లక్కీ నంబర్లకు లక్షలు!

21-05-2024 02:34 AM

ఫ్యాన్సీ నంబర్ల వేటలో వాహనదారులు

వేలంలో లక్షలకు లక్షలు కుమ్మరింత

‘9999’నంబర్‌కు రూ.25.50లక్షలు!

రవాణా శాఖకు రూ.43.70లక్షల ఆమ్దానీ

హైదరాబాద్ సిటీబ్యూరో, మే20(విజయక్రాంతి): రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్‌లను టీఎస్ నుంచి టీజీగా మార్చే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఫ్యాన్సీ నంబర్లకు డిమాండ్ పెరుగుతోంది. సోమవారం హైదరాబాద్ జిల్లాలోని ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఫ్యాన్సీ నంబర్లను దక్కించుకోవడం కోసం వాహనదారులు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా నిర్వహించిన వేలంలో రూ.43,70,284ల ఆదాయం వచ్చిందని, కేవలం 9999 నంబర్ కోసం ఏకంగా రూ.25లక్షలు పలకడం రాష్ట్రంలోనే అత్యధికమని హైదరాబాద్ ట్రాన్స్‌పోర్టు జాయింట్ కమిషనర్ సీ రమేష్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వారికి టీజీ నంబర్ ప్లేట్ ఇస్తున్నట్లు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ జిల్లాకు కోడ్‌ను జారీ చేసిందని చెప్పారు. ఆదిలాబాద్‌కు టీజీ  01, నారాయణపేటకు  38, కేటాయించగా, పోలీసు శాఖ వాహనాలకు 09 తో మొదలవుతాయని  చెప్పారు. ఆర్టీసీ బస్సులకు ఎప్పటిలాగే ‘జడ్’ సిరీస్ ఉంటుందని, ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు టీ, యూ, వీ, డబ్ల్యూ, ఎక్స్, వై సిరీస్‌లు ఉంటాయని పేర్కొన్నారు. వేలంలో ఫ్యాన్సీ నంబర్లను దక్కించుకున్న వారి వివరాలిలా ఉన్నాయి. టీజీ 09  ను సోని ట్రాన్స్‌పోర్ట్ సొల్యూషన్స్ ఏకంగా రూ.25,50,002కు దక్కించుకుంది.

టీజీ 09   నంబర్‌ను యర్రమనేని రామకృష్ణ  రూ.2.76లక్షకు సొంతం చేసుకోగా, టీజీ 09  నంబర్‌ను ఆరో అడ్వర్టుజింగ్ ఇండియా పైవేట్ లిమిటెడ్ అనే సంస్థ రూ.1,80,200కు దక్కించుకుంది.  టీజీ 09 ఏ 0019 నంబర్‌ను యలమంచిలి గోపాలకృష్ణ  రూ.1,20,019కి, టీజీ 09 ఏ  నంబర్‌ను రూ.1,16,111 విలియం కేనీ సంధ్య జలగం దక్కించుకున్నారు. టీజీ 09 ఏ 0009 నంబర్‌ను ఎస్కే కార్ లాంగీ అనే సంస్థ రూ.1,10,009కు దక్కించుకుంది.