03-05-2025 06:24:44 PM
జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏ వీరయ్య పర్యటన...
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏ వీరయ్య శనివారం బెల్లంపల్లిలో పర్యటించారు. బెల్లంపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న సివిల్ కోర్టు భవనాల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. నూతన కోర్టు భవనాల పనులను వేగంగా పూర్తి చేయాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. బెల్లంపల్లి పట్టణంలోని మున్సిఫ్ కోర్టు, నూతన కోర్టు భవనాలను జిల్లా ఫస్ట్ అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి రామ్మోహన్ రెడ్డి, స్థానిక మున్సిఫ్ కో ర్ట్ జడ్జి జె ముఖేష్ తో కలిసి పరిశీలించారు.
అంతకు ముందు జిల్లా కోర్టు ప్రధానన్యాయమూర్తి పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా సివిల్ కోర్టులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బెల్లంపల్లి పట్టణం లో నిర్మిస్తున్న నూతన కోర్టు భవనాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయన్నారు. కేసులు సత్వరoగా పరిష్కరించడంలో స్థానిక న్యాయమూర్తి, న్యాయ వాదులు చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చేను రవికుమార్, సీనియర్ న్యాయవాదులు రాము, అశోక్, సంగీత, సాయికుమార్, అనీల్, మమత, సునీల్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.