21-08-2025 12:00:00 AM
మాదిగ మాధవుల ఫోరం
ఖైరతాబాద్, ఆగస్టు 20 (విజయక్రాంతి) : నగరం లోనీ గచ్చిబౌలి లీడ్ క్యాప్ భూములను ఇతరులకు లీస్ కు ఇచ్చినటువంటి జీవో ను వెంటనే రద్దు చేసి భూములను వెనక్కి తీసుకోవాలని మాదిగ మాధవుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఆరేపల్లి రాజేందర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మా ట్లాడుతూ... లేదర్ ఇండస్ట్రీ కి సంబంధించిన గచ్చిబౌలి ఐదు ఎకరాల పదహారు గుంటల భూమిని, లీడ్ క్యాప్ కు చెందిన మొత్తం ముప్పు మూడు ఎకరాల భూములను యూనిక్ మాల్ కి, పెట్రోల్ పంపులకు ఈ నెల 18 న లీస్ కు ఇచ్చినటువంటి జీవో ను వెంటనే రద్దు చేయాలని అన్నారు .
చేవెళ్ల డిక్లరేషన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి దళితుల భూము ల జోలికి మేము రామని చెప్పి ఇప్పుడు ముప్పు మూడు సంవత్సరాల లీస్, రెండు సార్లు పొడిగించుకునే విధంగా అంటే మొత్తం తొంభైతొమ్మిది సంవత్సరాలకు లీడ్ క్యాప్ కు చెందిన మాదిగలకు సంబంధించిన భూములను తమ వర్గానికి కాకుండా ఇతరులకు కట్టబెట్టారని విమర్శించారు. ఇట్టి భూమిని వేరే వారికి ధారాదత్తం చేయాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు.
చర్మ కార్మికుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 12 లేదర్ ఫ్యాక్టరీలను రాష్ట్ర ప్రభుత్వం డెవలప్ చెయ్యాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఫోరం ఉపాధ్యక్షులు ఎన్నరెల్లి సాయి బాబా, జనరల్ సెక్రెటరీ సతీష్, కన్వీనర్ మాణిక్యరావు, అడ్వైజర్ పల్లెల వీర స్వామి, చుంచు రాజ్ కుమార్ (మిక్కీ) తదితరులు పాల్గొన్నారు.