calender_icon.png 21 August, 2025 | 7:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాస్త్రీయమైన తెలంగాణను నిర్మించుకోవాలి

21-08-2025 12:00:00 AM

-నేషనల్ సైంటిఫిక్ టెంపర్ డేలో పలువురు వక్తలు

ముషీరాబాద్, ఆగస్టు 20(విజయక్రాంతి): శాస్త్రీయతను అభివృద్ధి చేసి, సైన్స్ ను విస్తరింప చేయడానికి మూఢ నమ్మకాలు లేని శాస్త్రీయమైన తెలంగాణను నిర్మిం చుకోవాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, బీహార్ రాష్ట్రాలలో మాదిరిగా శాస్త్ర విజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి తెలంగాణలో మూఢవిశ్వాసాల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చి పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ మేరకు బుధవారం  బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జనవిజ్ఞాన వేధిక ఆధ్వర్యంలో డాక్టర్ నరేంద్ర దబోల్కర్ జ్ఞాపకార్థం ‘నేషనల్ సైంటిఫిక్ టెంపర్ డే’ నిర్వహించారు. మూఢ విశ్వాసాల నిరోధక చట్టాన్ని తీసుకురావాలని ముద్రించిన వాల్ పోస్టర్ ను తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిధారెడ్డి ఆవిష్కరించి మాట్లాడారు.

విజ్ఞాన శాస్త్రం ద్వారానే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. సమాజంలో రెండు భావాజాలలు కలిగిన వ్యకులు ఉంటారని, ఒకరు త్యాగం చేసైనా శాస్త్రీ భావాజాలాన్ని ముందుకు తీసుకువెళ్తూ సమాజంలో వెలుగులు నింపుతారని, మరొకరు మూఢనమ్మకాల పేరుతో ప్రజలను చీకటిలోనే ఉంచుతారని ఆరోపించారు. సైన్స్ ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని డాక్టర్ నరేంద్ర దబోల్కర్ స్పూర్తితో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.

ప్రముఖ రంగస్థల దర్శకుడు శాంతారావు, ప్రముఖ సినీ దర్శకులు ఉమా మహేశ్వర్ రావు, కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి ప్రధాన కార్యదర్శి స్కైలాబ్, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్, జన విజ్ఞాన వేదిక, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజా, ఉపాధ్యక్షులు ప్రొ.బీఎన్ రెడ్డి, డా.అందె సత్యం, డా.కె.వెంకటేశ్వర్ రావు, విద్యాసాగర్, జి.మురళీధర్, ఎం.శ్రీనివాసరావు, ఆర్.వరప్రసాద్, అల్తాఫ్, ప్రొ.ఎం.మమత తదితరులు పాల్గొన్నారు.