calender_icon.png 21 August, 2025 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెడికల్ షాపుల యజమానుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి

20-08-2025 11:01:33 PM

వనపర్తి టౌన్: వనపర్తి జిల్లాలో మెడికల్ షాపుల యజమానుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన మెడికల్ ల అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ కుమార్ తెలిపారు. బుధవారం వనపర్తి పట్టణంలోని మెడికల్ షాప్ అసోసియేషన్ కార్యాలయంలో లీగల్ అడ్వైజర్  బాలయ్య, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ జైనీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో  నూతన కమిటీ ఏకగ్రీవంగా ప్రకటించారు.

నూతన అధ్యక్షునిగా సురేష్ కుమార్, సెక్రటరీగా మద్దిలేటి, ట్రెజరర్ గా మణికుమార్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తమపై నమ్మకంతో అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు  తెలుపుతున్నామని అన్నారు  మెడికల్ షాప్ యజమానులకు అందరికీ వారి సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తాం అని తెలిపారు