15 April, 2026 | 9:14 AM

గ్రామంలో తట్టెడు మన్ను పొయ్యలేదు

07-11-2025 09:08 PM

బెజ్జంకి: బెజ్జంకి మండల పరిధిలోని గుండారం గ్రామమంలో గత ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ రసమయి బాలకిషన్ వ్యక్తిగత కక్ష్యలతో, రాజకీయాల లబ్ధి కోసం మంజూరు చేసిన నిధులను రద్దు చేయడం సమాజసం కాదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో గుత్తదారు రోడ్డు మరమ్మత్తుల పనులు మొదలు పెట్టి ఉన్న రోడ్డు సర్వనాశనం చేశాడు. గ్రామ ప్రజలకు ప్రయాణికులు చాల ఇబ్బంది పడుతున్నారు.

ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా దిబ్బతున్నది. మీ.. మీ రాజకీయ కక్షల కోసం మా గ్రామానికి వచ్చే నిధులను ఆపడం సరైనది కాదని గ్రామస్థులు మండి పడ్డారు.  అసలు గెలిచి ఏదో అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పే నాయకులు మా గ్రామం లో తట్టెడు మన్ను పొయ్యాలేదు అని ఆరోపించారు. వెంటనే రెండు రోడ్డులు పునర్నిర్మాణం చేపట్టాలి లేదంటే గ్రామ ప్రజలందరం కలసి క్యాంపు కార్యాలయంన్నీ ముట్టడిస్తామని హెచ్చరించారు. రానున్న రోజుల్లో తమ గ్రామాల్లో తిరగకుండా చేస్తామని గ్రామ ప్రజలు హెచ్చరిక చేశారు.