వరి, మొక్క జొన్న కొనుగోలు కేంద్రాల ప్రారంభం
07-11-2025 09:02 PM
తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గం పరిధిలో వరి, మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ రెవిన్యూ లింగ నాయక్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా లింగా నాయక్ మాట్లాడుతూ... రైతులకు ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా కొనుగోలు చేయాలని, కనీస మద్దతు ధర గ్రేడ్-ఏ రకానికి రూ.2389/- చొప్పున సన్న రకానికి రూ.500/- బోనస్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. రైతులు ఎవ్వరు కూడా దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వం అందించే సౌకర్యాలను ఉపయోగించు కోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ మోహన్ కృష్ణ, డీఎస్ఓ సుదర్శన్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.






