07-11-2025 09:11:54 PM
నకిరేకల్,(విజయక్రాంతి): అడవి పంది మాంసం విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులకు అటవీశాఖ అధికారులు రూ.50 వేల జరిమానా విధించిన ఘటన నకిరేకల్ పట్టణంలోని తాటికల్ ఫ్లైఓవర్ వద్ద గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎఫ్‌డీఓ నాగభూషణం, ఎఫ్‌ఆర్ఓ గౌతమ్, ఫారెస్ట్ అధికారి అశోక్ రెడ్డి లు తెలిపిన వివరాల ప్రకారం తాటికల్లు గ్రామానికి చెందిన ఎం.యాదగిరి, ఎం.రవిలు అడవి పందులు, కుందేలు వేటాడి, తాటికల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద బహిరంగంగా వాటి మాంసాన్ని విక్రయిస్తున్నారని సమాచారం అందడంతో దాడి నిర్వహించామని తెలిపారు. వారిని అదుపులోకి తీసుకుని, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. వారిపై ₹50 వేల జరిమానా విధించడంతో పాటు వారి వద్ద నుండి అడవి పంది మాంసం మరియు ఒక కుందేలును స్వాధీనం చేసుకున్నారు