ఉప్పొంగిన మ్యాన్‌హోల్స్

08-05-2024 01:51:15 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 7 (విజయక్రాంతి): నగరంలో కుండపోత వర్షాల ధాటికి మ్యాన్‌హోల్స్ ఉ ప్పొంగి ప్రవహించాయి. ప్రధాన రహదారులపై మంళవారం వరదనీరు పోటెత్తింది. దీంతో ఆయా ప్రాంతాల్లో మ్యాన్‌హోల్స్ ఉప్పొం గి ప్రవహించా యి. కోర్‌సిటీలో 2.04లక్షలు, శివార్ల లో దాదాపు 2.96 మ్యాన్‌హోళ్లుఉన్నా యి. నగరంలో కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలను ఇబ్బంది లేకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టాలని మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్  సెక్రటరీ దానకిషోర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్, ఈవీడీఎం డైరెక్టర్, జలమండలి ఎండీలను అప్రమత్తం చేశారు. దీనికోసం ఇప్పటికే క్షేత్రస్థాయిలో పని చేస్తున్న ఎమర్జెన్సీ రెస్పాన్స్‌టీమ్ లు(ఈఆర్టీ),ఎస్పీటీ వాహనాలు సైతం అప్ర మత్తంగా  ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా జీహె చ్‌ఎంసీ, జలమండలి, పోలీసు శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ పనిచేయాలన్నారు. 

మెట్రోకు అంతరాయం కలుగలేదు -  ఎన్వీఎస్ రెడ్డి మెట్రోఎండీ 

నగరంలో దంచికొట్టిన వర్షంతో మెట్రోరైలు సర్వీసులకు తీవ్ర అంతరాయం కలుగుతుందని మీడియా ఛానళ్లలో వస్తున్న కథనాలపై మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మంగళవారం రాత్రి స్పందించారు. రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేద న్నారు. రాకపోకలకు అంతరాయం కలుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నా మని, రైళ్లు నడుస్తున్నాయని ప్రకటించారు.  

ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు

హైదరాబాద్‌లో మంగళవారం భారీ వర్షాల కారణంగా పలు మార్గా ల్లో ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేశారు. లింగంపల్లి సికింద్రాబాద్, లింగంపల్లి, హైదరాబాద్  పల్లి మారాల్లో రైళ్లను రద్దు చేశారు.