19-07-2025 12:00:00 AM
నిజామాబాద్ సీపీ సాయి చైతన్య
నిజామాబాద్, జూలై 18:(విజయ క్రాంతి) : ముందస్తు గుర్తింపు ద్వారా క్యాన్సర్ను నివారించవచ్చని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, IPS., అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఇందు క్యాన్సర్ హాస్పిటల్ ప్రాంగణంలో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ పరీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ శిబిరంలో 250 మందికి స్క్రీనింగ్ పరీక్షలు (ఎక్స్-రే, ఈసీజీ, బ్లడ్ షుగర్, క్యాన్సర్ టెస్టులు) నిర్వహించడం అభినందనీయం అని ఆయన అన్నారు.
అమెరికాలో వైద్య విద్యనభ్యసిస్తున్న 12 మంది యువ డాక్టర్ల సేవలను ప్రశంసించిన ఆయన, ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరమన్నారు. ప్రజల రక్షణకై హెల్మెట్ వాడకాన్ని కూడా ప్రజల్లో అలవాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ప్రతినిధులు, ఔత్సాహిక వైద్యులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీరామ్ అయ్యర్, జంపన్న వర్మ, శ్రీధర్ శేషాద్రి, ఇతర వైద్య నిపుణులు పాల్గొన్నారు.