calender_icon.png 4 December, 2025 | 11:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముందు పెట్రోల్ పోసుకుని యువకుడు ఆత్మహత్యాయత్నం

04-12-2025 11:09:20 PM

మేడిపల్లి (విజయక్రాంతి): తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పోచంపల్లి, సంగారెడ్డి జిల్లాకు చెందిన సాయి ఈశ్వర్(35) అతనికి భార్య పిల్లలు ఉన్నారు. భార్య కవిత(30) ఇద్దరూ పాపలు, ఒక బాబు జగద్గిరిగుట్ట ముగ్ధంనగర్ లో నివసిస్తున్నారు.

గురువారం సాయంత్రం సాయి రాష్ట్రంలో బీసీలకు అన్ని ప్రధాన పార్టీలు అన్యాయం చేస్తున్నాయని, మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా, మోసం చేసిందని, దీనిపై తీన్మార్ మల్లన్న పోరాటం చేయాలని, క్యూ న్యూస్ ఆఫీసుకి వెళ్లగా మల్లన్న ఆఫీసులో లేరని చెప్పడంతో కిందికి వచ్చి క్యూ న్యూస్ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు. ఇది గమనించిన స్థానికులు, ఫైర్ ఇంజన్, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, మంటలను ఆర్పి గాంధీకి తరలించామని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.