calender_icon.png 4 December, 2025 | 11:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

కాంగ్రెస్ లో చేరిన గార్ల‌ప‌ల్లి బీఆర్ఎస్ అభ్య‌ర్థి

04-12-2025 11:04:39 PM

మునిప‌ల్లి (విజయక్రాంతి): మండ‌లంలోని గార్ల‌ప‌ల్లి బీఆర్ఎస్ అభ్య‌ర్థి ఈశ్వ‌రప్పతో పాటు మాజీ స‌ర్పంచ్ నాగేందర్ ప‌టేల్, గ్రామ మాజీ ఉప స‌ర్పంచ్‌ రాములు ప‌లువురు బీఆర్ఎస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు గురువారం సంగారెడ్డిలోని రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స‌మ‌క్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సంద‌ర్భంగా పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంత‌రం మంత్రి దామోద‌ర రాజనర్సింహ మాట్లాడుతూ ప్ర‌భుత్వం అమ‌లు సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు ప్ర‌తి కార్య‌క‌ర్త కృషి చేయాల‌ని సూచించారు. అలాగే పార్టీలో చేరిన కార్య‌క‌ర్త‌లంద‌ర‌కి కాంగ్రెస్ లో త‌గిన గుర్తింపు ఉంటుంద‌న్నారు. అదేవిధంగా జిల్లాలోని ప‌లు మండ‌లాల్లోని గ్రామ పంచాయ‌తీల్లో బీఆర్ఎస్ అభ్య‌ర్థులు క‌రువ‌య్యార‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో కాంగ్రెస్ శ్రేణులు త‌దిత‌రులు పాల్గొన్నారు.