calender_icon.png 4 December, 2025 | 11:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

రేపు దేశాయిపేట్ కు రానున్న శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజ్..

04-12-2025 10:56:35 PM

ఏర్పాట్లను పరిశీలించిన దేశాయిపేట్ గ్రామ పెద్దలు..

బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేట్ గ్రామానికి శుక్రవారం శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజ్ విచ్చేయనున్నట్లు గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ శ్రావణ్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుండి బాన్సువాడ బస్ డిపో నుండి భారీ ర్యాలీగా దేశాయిపేట్ గ్రామానికి మహారాజుకు ఘన స్వాగతం పలకడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ పవిత్ర సందర్భంలో శ్రీరామ నామస్మరణ, గురువంతన కార్యక్రమం శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజ్ ప్రవచనాలు, కీర్తనలు, సంబోధిస్తారనీ ఆయన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, భక్తులు, కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ప్రశాంత్ కుమార్, మాజీ వార్డు సభ్యులు రత్నాకర్, కాల రాజు, రాధాకృష్ణ, శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.