04-12-2025 11:02:10 PM
తండావాసులకు బాండ్ పేపర్ రాసి ఇచ్చిన సర్పంచ్ అభ్యర్థిని
సమస్యలు పరిష్కరించకుంటే పదవికి రాజీనామా చేసి పోరాటం చేస్తా
సర్పంచ్ గా గెలిపించి సమస్యల పరిష్కారం కు అవకాశం కల్పించండి
కామారెడ్డి జిల్లా గజ్యనాయక్ తండలో బాండ్ పేపర్ రాసిచ్చిన సర్పంచ్ అభ్యర్థిని
కామారెడ్డి (విజయక్రాంతి): సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తే గజ్జయ నాయక్ తండలోని ప్రధాన సమస్యలు పరిష్కరిస్తానని సర్పంచ్ అభ్యర్థిని గోనే శివాని 100 రూపాయల బాండ్ పేపర్ పై తండా ప్రజలకు గురువారం హామీ పత్రాన్ని రాసి ఇవ్వడం జిల్లాలో కలకలం రేపింది. తండా ప్రజలు సర్పంచ్ గా తనను గెలిపిస్తే గెలిచిన ఆరు నెలల నుండి సంవత్సరం లోపు సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రహదారిపై ఇరువైపులా డ్రైనేజీ నిర్మాణం చేపడతానని, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయిస్తానని బాండ్ పేపర్ లో తండా ప్రజలకు రాసి ఇచ్చారు.
లేనిపక్షంలో సర్పంచ్ పదవికి రాజీనామా చేసి పోరాటం చేస్తానని బాండ్ పేపర్లో సర్పంచ్ అభ్యర్థిని గోనే శివాని పేర్కొన్నారు. ఈ బాండ్ పేపర్ రాసి ఇవ్వడం జిల్లాలో కలకలం రేపుతుంది. ఆమె బాండ్ పేపర్ లో హామీలు నెరవేస్తానని రాసి ఇవ్వడం చూసి మరికొందరు ఇదే బాటను ఎంచుకునే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. గ్రామ ప్రజలకు నమ్మకం కలిగించేందుకు శివాని వంద రూపాయల బాండ్ పేపర్ పై తన ప్రధాన హామీలను రాశి ఇవ్వడం కలకలం రేపుతుంది.