calender_icon.png 13 September, 2025 | 6:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీజీవో ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ

26-04-2025 10:41:52 PM

కామారెడ్డి (విజయక్రాంతి): జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటన నిరసిస్తూ అక్కడ మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని శనివారం రాత్రి కామారెడ్డిలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్(Telangana Gazetted Officers Association) ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం నుండి నిజాంసాగర్ చౌరస్తా వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు నరాల వెంకట్ రెడ్డి, రాజారామ్, దయానంద్ తిరుమల ప్రసాద్ వెంకటేశ్వర్లు సాయి రెడ్డి భూమయ్య తదితరులు పాల్గొన్నారు.