calender_icon.png 13 September, 2025 | 7:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం!

13-09-2025 05:38:26 PM

లారీ, జేసీబీ సీజ్

ముగ్గురిపై కేసు నమోదు

అశ్వాపురం  (విజయక్రాంతి): అశ్వాపురం మండలంలో ​జగ్గారం గ్రామంలోని శనివారం ఇసుక దందాకు అధికారులు అడ్డుకట్ట వేశారు. అక్రమంగా ఇసుకను నిల్వ చేసి, అక్కడి నుంచి ఇల్లందుకు తరలిస్తున్న ఓ లారీతో పాటు, దానికి సహాయపడిన జేసీబీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ​ఈ ఘటనకు సంబంధించి, మంచి కంటి నగర్‌కు చెందిన ఊకే సతీష్, ఇల్లందుకు చెందిన లారీ డ్రైవర్ భూక్య జానీ, జేసీబీ యజమాని పరుచూరి రాకేష్ లపై కేసు నమోదు చేసినట్లు అశ్వాపురం సిఐ అశోక్ రెడ్డి(CI Ashok Reddy) తెలిపారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.