అల్ఫోర్స్ ఇ-టెక్నో లో ఘనంగా హిందీ దివస్ వేడుకలు
13-09-2025 06:15 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో ముందస్తు జాతీయ హిందీ దివస్(National Hindi Diwas) వేడుకలకు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ హిందీ భాష ప్రాచీనమైన దేవనగిరి లిపి నుండి ఆవిర్భవించినదని, హిందీలో ఉన్నటువంటి మాధుర్యాన్ని పరిగణించి ఆ భాషను జాతీయ భాషగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. హిందీ భాష ద్వారా ఎన్నో అవకాశాలు ఉంటాయని హిందీ భాష మాట్లాడే వారికి ఉపాధి అవకాశాలు చాలా ఉంటాయని అన్నారు. అనంతరం హిందీ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






