calender_icon.png 13 September, 2025 | 9:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాదిగలు ఉపాధి, రాజకీయ రంగాలలో ఎదగాలి

13-09-2025 06:47:22 PM

- ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి దేవని సతీష్ మాదిగ

- విద్యా, ఉద్యోగ రంగాలలో Sc వర్గీకరణ చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గార్కి కృతజ్ఞతలు.

సిద్దిపేట: రాష్ట్రంలో ఉపాధి, రాజకీయ రంగాలలో మాదిగలను రేవంత్ సర్కార్ ఆదుకోవాలనీ ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి దేవని సతీష్ మాదిగ అన్నారు. ఎమ్మార్పీఎస్‌ ఉద్యమం మాదిగల అభివృద్ధి కొరకు మాత్రమే పనిచేస్తుందన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. గ్రూప్ 1 బుడుగ జంగాల కార్పొరేషన్, గ్రూప్ 2 మాదిగ కార్పొరేషన్, గ్రూప్ 3 మాల కార్పొరేషన్ చైర్మన్, సభ్యుల పదవులు, ఎస్సీ వర్గీకరణ ప్రకారం నియమించాలన్నారు. ఎస్సీ వర్గీకరణ చేసిన కాంగ్రెస్ పార్టీకి మాదిగలు అండగా ఉండాలని ఎమ్మార్పీఎస్‌ నాయకులు తీర్మానించారు. ఎస్సీ రిజర్వేషన్ ను 15 శాతం రిజర్వేషన్ నుంచి 18 % వరకు పెంచాలనీ, ఎస్సీ లోని 59 కులాల జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేయాలని సమావేశంలో తీర్మానం చేశారు.

మాదిగలు ఉద్యమాలతొ ఇతరకులాలకు ఊడిగం చేయమని విజ్ఞప్తి చేశారు. మాదిగలు మాదిగల అభివృద్ధి కొరకే ఎమ్మార్పీఎస్‌ పనిచేస్తుందని చెప్పారు. కెసిఆర్ ప్రభుత్వం దళితులను మోసం చేసిందనీ, కాంగ్రెస్ ప్రభుత్వం దళితుల అభివృద్ధికి నిధులు అత్యధికంగా కేటాయించి ఖర్చు చేయాలనీ, దళితులను అభివృద్ధి చేయాలనీ తీర్మానంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ నాయకులు అలారం రత్నయ, మెదక్ జిల్లా ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు, పెద్దమాతరి బాబు మాదిగ, బొందని రాజమల్లు మాదిగ, రోమాల బాబు, బాకురి అశోక్, ఎర్ర మహేందర్, ప్రభు, తదితరులు పాల్గొన్నారు.