13-09-2025 06:00:17 PM
200 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సత్కారం
ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి
25 సంవత్సరాలుగా గురుపూజోత్సవ వేడుకలు నిర్వహించడం అభినందనీయం
ఎమ్మెల్యే జిఎంఆర్ కు ఎంపీ రఘునందన్ రావు కితాబు
పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గస్థాయి ప్రైవేటు పాఠశాల గురుపూజోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు(MP Raghunandan Rao), ఎమ్మెల్సీ అంజిరెడ్డి హాజరయ్యారు. గత రెండు దశాబ్దాల కాలంగా ప్రతి ఏటా గురుపూజోత్సవ వేడుకలు నిర్వహిస్తూ గురువులను సన్మానించడం పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికే దక్కిందని ఎంపీ రఘునందన్ రావు కితాబునిచ్చారు. ప్రతి సంవత్సరం ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయుల కోసం గురుపూజోత్సవ వేడుకలు నిర్వహిస్తూ ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించడం అభినందనీయమని ఎమ్మెల్సీ అంజిరెడ్డి ప్రశంసించారు. నవ సమాజ నిర్దేశకులు గురువులను సన్మానించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని ప్రైవేటు పాఠశాలల ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.