13-09-2025 06:26:47 PM
హనుమకొండ (విజయక్రాంతి): మలేషియాలో జరిగే అంతర్జాతీయ సెమినార్ కు హాజరుకానున్న హనుమకొండ జిల్లా క్రీడలు యువజన అధికారి గుగులోతు అశోక్ కుమార్ ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి(MLA Naini Rajender Reddy) శనివారం అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అశోక్ కుమార్ అంతర్జాతీయ సెమినార్ లో పాల్గొనడం అభినందనీయమని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో హనుమకొండకు పేరు తీసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఒలంపిక్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, హనుమకొండ జిల్లా గ్రంథాలయ చైర్మన్ అజీజ్ ఖాన్, అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి, బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి డాక్టర్ రమేష్ రెడ్డి, వరద రాజేశ్వర్ రావు, కార్పొరేటర్లు తోట వెంకన్న, మామిండ్ల రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.