calender_icon.png 13 September, 2025 | 8:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హామీ ఇచ్చారు... డెస్క్ బెంచీలు అందజేశారు

13-09-2025 06:54:42 PM

- 7 లక్షల వ్యాయంతో 110 బెంచీల బహూకరణ

- ఒకవైపు ప్రభుత్వ పాఠశాలల బలోపేతం మరోవైపు రెసిడెన్షియల్ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం

- మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు,(విజయక్రాంతి): ఒకవైపు ప్రభుత్వ పాఠశాలల బలోపేతం మరోవైపు రెసిడెన్షియల్ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టి సొంత నిధులతో పాఠశాలలో డిస్క్ బెంచీల బహుకరణ చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మునుగోడు నియోజకవర్గంలో  నెలకొన్న సమస్యలు స్వయంగా తెలుసుకోవడానికి గ్రామాలలో మార్నింగ్ వాక్ కార్యక్రమం  శ్రీకారం చుట్టి గ్రామీణ సమస్యలే కాకుండా ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యల పైన  విద్యార్థులు ఉపాధ్యాయులతో మాట్లాడి తెలుసుకునేవారు. నెలన్నర క్రితం  మునుగోడు మండలం పలివెల గ్రామంలో  మార్నింగ్ వాక్ చేస్తూ ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన  ఎమ్మెల్యేకు బెంచీలు సరిగా లేవని విద్యార్థులు దృష్టికి తీసుకొచ్చారు.

త్వరలోనే కొత్త బెంచీలు  ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి, మంగళవారం విద్యార్థిని విద్యార్థులకు ఇచ్చిన హామీ ప్రకారం  తన సొంత ఖర్చు (7 లక్షల రూపాయల వ్యయం) తో  పలివెల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు సరిపడా 110 బెంచీలను ప్రత్యేకంగా తయారు చేయించి  పాఠశాలలకు బహుకరించారు. కార్పొరేట్ పాఠశాలల స్థాయిలో డెస్క్ బెంచీలు నాణ్యతలో రాజీ పడకుండా  ప్రతి తరగతి గదికి అందచేశారు.గతంలో తమ పాఠ్యపుస్తకాలను ఎక్కడపడితే అక్కడ  వేయాల్సి వచ్చేదని  డెస్క్ బెంచీలు ఎమ్మెల్యే  ఇచ్చిన తర్వాత  కూర్చున్న ప్లేస్ లోనే  పాఠ్యపుస్తకాలను కూడా  దాచుకునేలా బెంచిలు ఉన్నాయని విద్యార్థులు మురిసిపోతున్నారు.విద్యార్థులు కొత్తగా ఏర్పాటు చేసిన డెస్క్ బెంచ్ లపై  క్రమశిక్షణతో కూర్చొని  శ్రద్ధతో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను వింటూ సంతోషం వ్యక్తం చేశారు.రాజగోపాల్ రెడ్డి తన సొంత ఖర్చుతో ప్రభుత్వ పాఠశాలల్లో  మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న తీరును చూసి  గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.