13-09-2025 05:56:13 PM
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్
నిజామాబాద్ (విజయక్రాంతి): జిల్లాలో స్థానిక సంస్థలన్నీ బీజేపీ కైవసం చేసుకుంటాయని ధీమా వ్యక్తం చేస్తూ కార్యకర్తలందరూ ఎన్నికలకు సిద్ధమవ్వాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్(MP Dharmapuri Arvind) కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అన్ని పార్టీల నాయకులు బీజేపీ టికెట్ కోసం క్యూ కడుతున్నారని, గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గెలువదు అని స్వయంగా ఫోన్స్ చేస్తున్నారు కాంగ్రెస్ ను నమ్మే పరిస్థితి లేదు మాకు బీజేపీ టికెట్ ఇవ్వండి అని ఆశావాహులు మోర పెట్టుకుంటున్నారని అరవింద్ తెలిపారు. శనివారం బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా జిల్లా కార్యాశాల కార్యక్రమా ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇందూరు పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి మాట్లాడుతూ నిజామాబాద్ లో అన్ని స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుంది కార్యకర్తలు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ప్రతి ఒక్కరికి సముచిత న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడి గారి నాయకత్వంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది. స్వచ్ఛ భారత్, డిజిటల్ ఇండియా, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు ప్రతి రంగంలో బీజేపీ ప్రభుత్వమే కృషి చేస్తోంది. తెలంగాణలో కూడా అదే విధంగా బీజేపీ జెండా ఎగరబోతుంది” అని ఆయన తెలిపారు. జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి మాట్లాడుతూ కార్యకర్తలే పార్టీ బలం. సేవ, సమర్పణ భావంతో ప్రతి ఇంటికి బీజేపీ సిద్ధాంతాలను తీసుకెళ్లాలి. సేవా పక్షం లో భాగంగా ప్రతి బూత్ స్థాయిలో కార్యక్రమాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అని అన్నారు.కార్యక్రమంలో పసుపు బోర్డు చేర్మెన్ పల్లె గంగారెడ్డి రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్ రెడ్డి, మేడపాటి ప్రకాష్ రెడ్డి,జిల్లా ప్రదాన కార్యదర్శి నాగోళ్ళ లక్ష్మి నారాయణ, న్యాలం రాజు, ఉపాధ్యక్షలు రాంచందర్, పాలేపు రాజు, నర్సారెడ్డి, జిల్లా, నగర, మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు.