calender_icon.png 1 August, 2025 | 3:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిగాచి మృతులకు కొవ్వొత్తుల నివాళి

31-07-2025 12:02:09 AM

పటాన్చెరు, జూలై 30 : పాశమైలారం సిగాచి  పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించి నెల రోజులు పూర్తయిన సందర్భంగా బీఆర్‌ఎస్ శ్రేణులు, మాజీ జెడ్పిటిసి గడీల శ్రీకాంత్ గౌడ్, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ కొవ్వొత్తులతో నివాళి కార్యక్రమం నిర్వహించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన ఘటన అత్యంత విషాదకరమైందన్నారు.

ఈ ప్రమాదంలో 54 మంది మరణించడం దారుణమని. బీఆర్‌ఎస్ పార్టీ తరపున మరణించిన కార్మికులకు, పరిశ్రమ సిబ్బందికి నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. కాగా నెలరోజులు గడుస్తున్నావారికి చెల్లించాల్సిన రూ.కోటి పరిహారాన్ని పరిశ్రమ గానీ, ప్రభుత్వం గానీ ఇవ్వకపోవడం విచారకరమన్నారు.  బీఆర్‌ఎస్ పార్టీ బాధితులకు అండగా నిలిచి నష్టపరిహారం చెల్లించేలా పోరాడతామని వారు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో  బిఆర్‌ఎస్వీ నాయకులు మేరాజ్ ఖాన్, మాణిక్ యాదవ్, రామకృష్ణ ముదిరాజ్, మొబైల్ అసోసియేషన్ సభ్యులు నరేందర్ రెడ్డి, అహ్మద్, భూపాల్, నర్వోతం రెడ్డి, దీపక్, ఎస్ ఆర్ కె యువసేన సభ్యులు ధన్ రాజ్, షకీల్, సల్మాన్, సాయి కుమార్, దుర్గా సాయి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.