calender_icon.png 31 July, 2025 | 6:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ బస్సులను సద్వినియోగం చేసుకోవాలి

31-07-2025 12:00:00 AM

నల్లగొండ డిపో మేనేజర్ శ్రీనాథ్

శాలిగౌరారం, జులై 30 : గ్రామీణ ప్రాంత ప్రయాణికుల సౌకర్యార్థం నడిపిస్తున్న ఆర్ టి సి బస్సులను సద్వినియోగం చేసుకోవాలని నల్లగొండ ఆర్‌టిసి డిపో మేనేజర్ ఎం. శ్రీనాథ్ కోరారు. బుధవారం శాలిగౌరారం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ నకిరేకల్ శాలిగౌరారం రూట్ లో నడిపిస్తున్న ఉప్పల్ ఎక్స్ రోడ్డు బస్సును,విద్యార్థుల సౌకర్యం కొరకు వేసిన నకిరేకల్-అమ్మనబోల్, నకిరేకల్  -చిత్తలూరు-గురజాల సద్వినియోగం చేసుకోవా లని కోరారు.

  బస్సులను ఆదరిస్తే ఆర్‌టిసికి ఆదాయం వస్తే నకిరేకల్ -శాలిగౌరారం రూట్‌లో మరిన్ని బస్సులు నడిపిస్తామన్నారు. మోడల్ స్కూల్ విద్యార్థుల సౌకర్యం కొరకు నార్కెట్పల్లి డిపో బస్సును నేటి నుంచి అమ్మనబోల్,గురజాల, శాలిగౌరారం మీదుగా నకిరేకల్ కు బస్సును నడిపిస్తున్నట్లు అయన తెలిపారు.

ఈ బస్సు అమ్మనబోల్‌లో ఉదయం 8 గంటలకు బయలుదేరి విద్యార్థులను తీసుకొని ఉదయం 9-15 కు నకిరేకల్ చేరుకుంటుందని అన్నారు. తిరిగి నకిరేకల్ లో సాయం త్రం 3-50 కి బయలుదేరి వల్లాల, శాలిగౌరారం, గురజాల మీదుగా అమ్మనబోల్ కు చేరుకుంటుందని డి ఎం శ్రీనాథ్ తెలిపారు.