24-12-2025 10:17:13 AM
మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల(Maripeda Mandal) కేంద్రంలో గంజాయితో పారిపోవడానికి యత్నించిన ముగ్గురుపై కేసు నమోదు చేసినట్టు మరిపెడ అదనపు ఎస్సై కోటేశ్వరరావు తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారము మరిపెడ కార్గిల్ సెంటర్ మంగళవారం వద్ద ముగ్గురు యువకులు ప్రవీణ్, నవీన్, విజయ్ అను వ్యక్తులు 500 గ్రాముల గంజాయి పట్టుకుని పారిపోవడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని ముగ్గురిని పట్టుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మరిపెడ మరిపెడ అదనపు ఎస్సై కోటేశ్వరరావు తెలిపారు. ఈ తనిఖీల్లోస్థానిక మరిపెడ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.