24-12-2025 10:14:02 AM
కొల్లి ఫౌండేషన్ సేవలు ప్రశంసనీయం
రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల
ఉచిత కాన్సర్ స్క్రీనింగ్ శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకున్న కొత్వాల
పాల్వంచ,(విజయక్రాంతి): సమాజంలోని ప్రతి ఒక్కరూ సామాజికంగా సమాజసేవలో ముందుండాలనీ, కొల్లి ఫౌండేషన్ సేవలు అభినందనీయమని, ప్రశంసనీయమని రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచ పట్టణం పరిధిలోని అనుబోస్ ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణలో కొల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో, హైదరాబాద్ బసవతారకం ఇండో-అమెరికన్ కాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ వారి సౌజన్యంతో రెండు రోజులపాటు ఉచిత కాన్సర్ స్క్రీనింగ్ శిబిరం నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో కొత్వాల పాల్గొని, వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ సేవ ప్రతి పౌరుని బాధ్యత అనీ అన్నారు. తొలి రోజు 300 మందికి పైగా ప్రజలు పరీక్షలు చేయించుకున్నారు. బుధవారం సైతం ఉచిత క్యాన్సర్ స్కానింగ్ క్యాంపు నిర్వహించబడుతుంది. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాకతీయ కమ్యూనిటీ ఫౌండేషన్ చైర్మన్ గూడూరు సత్యనారాయణ, అనుబోస్ విద్య సంస్థల చైర్మన్ తలశిల భరత్, కొత్తగూడెం కార్పొరేషన్ కమిషనర్ సుజాత, మల్లెల రవిచంద్ర, కొల్లి కల్పనా చౌదరి, రూప్లా, కోండం వెంకన్న, Y వెంకటేశ్వర్లు (YV)*, తదితరులు పాల్గొన్నారు.