25-05-2025 09:15:30 AM
జూబ్లీహిల్స్: హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి(Jubilee Hills Police Station Area)లో శనివారం రాత్రి కారు బీభత్సం సృష్టించింది. జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45 లో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఎయిర్ బ్యాగ్ తెరుచుకోవడంతో డ్రైవర్ కు ప్రమాదం తప్పింది. ప్రమాదం అనంతరం యువకుడు కారును ఘటనాస్థలిలోనే వదిలేసి పరారయ్యాడు. ఈ ప్రమాదానికి అతివేగం, మద్యం మత్తే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు కారును స్టేషన్ కు తరలించారు. అనంతరం పరారైన యువకుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.