calender_icon.png 12 October, 2025 | 12:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వనస్థలిపురం సమీపంలో కారు బీభత్సం

12-10-2025 09:57:21 AM

హైదరాబాద్: వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బిన్ రెడ్డి నగర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయలయ్యాయి. గుర్రంగూడ దగ్గర శనివారం అర్థరాత్రి  కారు బీభత్సం సృష్టించింది.  ఇంజాపూర్ నుంచి గుర్రంగూడ వైపు వెళ్తున్న థార్ కారులో డైవర్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ బైక్‌ను ఢీకొట్టాడు. అనంతరం బైక్ ను ఢీకొట్టడంతో పాటు డివైడర్ దాటి మరో కారును ఢీకొట్టింది. దీంతో థార్ కారు రోడ్డుపై మూడు పల్టీలు కొట్టి బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న సిరిసిల్లకు చెందిన ఇద్దరు విద్యార్థులు, కారు డ్రైవర్, యాజమాని అనిరుధ్ తో పాటు కారులోని దినేష్, శివ అనే ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను హస్తినాపురంలోని రెండు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తెలింది. ఈ ఘటనతో అక్కడ తీవ్ర ట్రాఫిక్ కావడంతో పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.