12-10-2025 10:33:32 AM
హైదరాబాద్: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఆదివారం వరద ప్రవాహం కొనసాగుతుంది. భారీగా ఇన్ ఫ్లో వస్తుండటంతో 8 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 1.16 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి కాల్వకి 10,040 క్యూసెక్యుల, ఎడవ కాల్వకి 7,353 క్యూసెక్యుల నీటిని విడుదల చేశారు. ఇన్ ఫ్లో 3,05,426 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 3,13,704 క్యూసెక్కులు, పవర్ హౌస్ కు 33,048 క్యూసెక్కులు, స్పెల్ వే ద్వారా 64 వేల క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు. ప్రస్తుత నీటి మట్టం 590 అడుగులు కాగా, పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులుగా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450టీఎంసీలుగా ఉంది. ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది.