12-10-2025 04:05:56 AM
హైదరాబాద్, అక్టోబర్ 11 (విజయక్రాంతి) : పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ పై తెలంగాణ ప్రభుత్వం వ్యక్తం చేసిన అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నదని జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తెలిపారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి రాసిన లేఖలో ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలను ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం పోలవరం లింక్ ప్రాజెక్ట్‌కు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టు(పీఎఫ్‌ఆర్)ను సెంట్ర ల్ వాటర్ కమిషన్(సీడబ్ల్యూసీ)కు ఇప్పటికే సమర్పించిందని, ఆ నివేదికను ప్రస్తుతం సీడబ్ల్యూసీ పరిశీలిస్తోందని పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టు టెక్నో ఎకనామికల్ అప్రైజల్ ప్రక్రియ పూర్తి చేయనున్నట్టు సూచించారు. పీఎఫ్‌ఆర్‌ను గోదావరి బేసిన్‌లోని తెలంగాణ సహా మహా రాష్ర్ట, కర్ణాటక, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు పంపినట్టు పేర్కొన్నారు. ఇప్పటికే తెలంగాణ తెలియజేసిన అభిప్రాయాలు, అభ్యంతరాలను పరిశీ లిస్తున్నామ ని, గోదావరి బేసిన్‌లోని అన్ని రాష్ట్రాల అభిప్రాయాల మేరకు సాంకేతిక, ఆర్థిక అంశాల ను నిబంధనల మేరకు అధ్యయనం చేస్తున్నట్లు లేఖలో వివరించారు. అయితే, కేంద్రా నికి ఏపీ పంపిన పీఎఫ్‌ఆర్‌ను వ్యతిరేకిస్తూ ఈ ఏడాది జూన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేఖ లు రాశారు. ప్రస్తుతం వాటిపై స్పందిస్తూ కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్ లేఖ రాశారు.