ఎమ్మెల్యే కౌశిక్‌కు సీనియర్ల సెగ
ద్వితీయ శ్రేణి నాయకత్వంపై నిర్లక్ష్యం!
పేరు ఆయనకు, కేసులు మాకా? అంటూ విరుచుకుపడ్డ నేతలు
జమ్మికుంటలోని ఓ ఫామ్‌హౌస్‌లో 100 మంది అసంతృప్త నాయకుల రహస్య భేటీ
హుజురాబాద్, మార్చి 21 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో బాద్‌షాలా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి సొంత పార్టీ నాయకుల నుంచి అసంతృప్త స్వరాలు వినిపిస్తున్నాయి. కౌశిక్‌రెడ్డి తీరుపై నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్ సీనియర్ నేత లు తిరుగుబాటు చేసేందుకు నియోజకవర్గం పరిధిలోని జమ్మికుంట పట్టణంలోని ఓ వెంచర్‌లో శుక్రవారం రహస్య సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అసంతృప్త నాయకులు సుమారు 100 మంది భేటీ అయినట్లు సమాచారం.
ఈ సమావేశంలో కౌశిక్‌రెడ్డి వ్యవహార శైలిపై సుదీర్ఘంగా చర్చ లు జరిపినట్టుగా తెలుస్తోంది. ద్వితీయ శ్రేణి నాయకులను పట్టించుకోవడంలో, పార్టీ అధినేత కేసీఆర్‌కు నాయకులను పరిచయం చేసే విషయంలో ఎమ్మెల్యే నిర్లక్ష్యం ప్రదర్శిస్తారని చర్చించారని సమాచారం. ఆయన దూకుడు స్వభావం వల్ల ప్రతికూలతను చవి చూడాల్సి వస్తోందన్న ఆవేదన కూడా వ్యక్తం చేసినట్టుగా సమాచారం. ఇంతకు ముందు కూడా బీఆర్‌ఎస్ నాయకులు రెండు మూ డు సార్లు భేటీ అయినట్టుగా విశ్వసనీయ సమాచారం. అంతేకాకుండా సీనియర్ నా యకులపై వివక్ష చూపుతుండటంతో పా టు మునిసిపల్ ఎన్నికల్లో తమకు అన్యా యం చేసే విధంగా నడుచుకున్నారన్న విషయంపై కూడా చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది.
మునిసిపల్ ఎన్నికల్లో పార్టీ నిర్ణయా న్ని ధిక్కరించి పోటీ చేసిన వారికి కౌశిక్‌రెడ్డి సన్నిహితులు ప్రచారం చేయడంలో కౌశిక్‌రెడ్డి హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నట్లు సమాచారం. వీణవంక సమ్మక్క, సారలక్క జాతర వద్ద చోటు చేసుకున్న పరిణామాలు సైతం తమ గెలుపోటములను శాసించాయ న్న ఆందోళనతో కొంతమంది నాయకులు ఉన్నట్టుగా తెలుస్తోంది. పార్టీ సీనియర్లను పట్టిం చుకోని వైఖరితో విసిగిపోయారని, హుజురాబాద్ వాసులమని చెప్పుకోవడం కంటే.. హనుమకొండ నివాసులమని చెప్పుకునే పరిస్థితి మేలనే కామెంట్లు కూడా విని పిస్తున్నాయి.
ఆయన వ్యక్తిగత లాభం కోసం తప్ప క్యాడర్ గురించి పట్టించుకోవడం లేదన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారని సమాచారం. తరుచూ భేటీ అవుతున్న జమ్మికుం ట బీఆర్‌ఎస్ నాయకులు పార్టీకి గుడ్ బై చెప్పడమా లేక హై కమాండ్‌కు ఫిర్యాదు చేయడమా అన్న విషయంపై తర్జనభర్జనలు పడుతున్నట్టుగా తెలుస్తోంది. విశ్వసనీయం గా అందిన సమాచారం మేరకు ఒకరిద్దరు ముఖ్యనాయకులు పార్టీని వీడేదుంకే సిద్ధం గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇవే కాక, కౌశిక్ రెడ్డి నోటి దురుసు, దుందుడుకు వైఖరి మూల నా వెంట ఉండే వారిపై కేసులు అవుతుండటంతో సీనియర్ నాయకులు తీవ్రంగా విసి గిపోయినట్లు తెలుస్తోంది.
సొమ్ము ఒకరిది సోకు ఇంకొకరిది అన్న చందానా పేరు ఆయనకు.. కేసులు మాపై అవుతున్నాయని, అలాగే, అటువంటి కేసులకు న్యాయ సహా యం అందించడంలో, అండగా ఉండటం లో కౌశిక్‌రెడ్డి విఫలమయ్యారని చర్చ కొనసాగినట్లు తెలుస్తోంది. నాయకుల కేసులను కౌశిక్‌రెడ్డి లైట్ తీసుకున్నట్టు చర్చించుకున్నారు. దూకుడు స్వభావం కలిగిన కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా బయటకు వచ్చి తిరుగుబాటు స్వరం వినిపిస్తారా, లేక భయపడి ఆగిపోతారా అన్నది వేచి చూడాల్సి ఉంది.




