అదుపుతప్పి కారు బోల్తా
14-07-2026 12:00 AM
పెంచికల్ పేట్ ,జులై ౧3 (విజయక్రాంతి): మండలంలోని బొంబాయి గూడా గ్రామ శివారులో గల ఉచ్చమల్ల వంతెన సమీపంలో సోమవారం కారు టైరు పంచర్ కావడంతో అదుపు తప్పి డివైడర్ కి ఢీకొని పల్టీ కొట్టింది. ప్రమాద సమయంలో కారులోని ఎయిర్ బ్యాగులు తెచ్చుకోవడంతోద కారులో ప్రయాణిస్తున్న ప్రవీణ్ కి స్వల్ప గాయాలు అయ్యాయి. సంఘటన విషయం తెలుసుకున్న ఎస్‌ఐ అనిల్ కుమార్ అక్కడికి చేరుకొని ప్రమాద జరిగిన తీరును పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్స్ర తెలిపారు.






