calender_icon.png 23 August, 2025 | 3:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వృద్ధాప్య సంరక్షణకు కేర్ హాస్పిటల్స్ భాగస్వామ్యం

22-08-2025 02:14:04 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 21(విజయక్రాంతి): ప్రపంచ సీనియర్ సిటిజన్స్ దినోత్సవం సందర్భంగా కేర్ హాస్పిటల్స్, దేశంలోని ప్రముఖ వృద్ధుల సంరక్షణ సంస్థ ఎమోహాతో కలిసి, హైదరాబాద్‌లో వృద్ధుల సంరక్షణలో కీలక ముందడుగు వేసింది. ఈ భాగస్వామ్యం ద్వారా వృద్ధులకు వైద్యపరంగా మాత్రమే కాకుండా, భావోద్వేగపరం గానూ తోడ్పాటు అందించే పూర్తి స్థాయి సంరక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నా రు.

ఈ భాగస్వామ్యంలో భాగంగా 2025, అక్టోబర్ 1న హైదరాబాద్‌లోని కేర్ హాస్పిటల్స్‌లో అత్యాధునిక జెరియాట్రిక్ కేర్ ఫెసిలి టీ ప్రారంభం కానుంది. వృద్ధుల ప్రత్యేక అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ యూనిట్‌లో సమగ్ర వృద్ధాప్య సమస్యల అంచనా నుంచి ఆధునిక వైద్య చికిత్సల వరకు అన్ని సేవలు అందిస్తారు. దీర్ఘకాలిక, సంక్లిష్టమైన ఆరోగ్య సమస్యలతో ఉన్న వృద్ధులకు ఇది మొదటిసారి అందించే ప్రత్యేక వైద్య సంరక్షణ కేంద్రంగా నిలుస్తుంది.

మోహా యాప్ ద్వారా పెద్దలు దేశవ్యాప్తంగా ఉన్న సీనియర్ కమ్యూనిటీతో ఎప్పుడూ కనెక్ట్ అయి ఉంటారు. ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌లు, ఇంటరాక్టివ్ సెషన్లు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈవెంట్లు వీరిని ఉత్సాహంగా, ఆనందంగా ఉంచుతాయి. కేర్ హాస్పిటల్స్ జోనల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బిజు నాయర్ మాట్లాడుతూ.. ‘కేర్ హాస్పిటల్స్‌లో మేం ఎప్పుడూ సమగ్ర ఆరోగ్య సేవలను, ప్రజల మారుతున్న అవసరాలకు తగ్గట్టుగా అందించడాన్ని నమ్ముతాం.

ఎమోహతో ఈ కొత్త అనుబంధం వృద్ధుల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది’ అని పేర్కొన్నారు. ఎమోహా ఎల్డర్‌కేర్ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు సౌమ్యజిత్ రాయ్ మాట్లాడుతూ.. వృద్ధుల కోసం సమగ్రమైన సంరక్షణ వాతావరణాన్ని నిర్మించే దిశగా ఎమోహా, కేర్ హాస్పిటల్స్ కలిసి కీలకమైన అడుగు వేస్తున్నాయని చెప్పారు.