calender_icon.png 23 August, 2025 | 7:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనర్ బాలల హక్కులకు భంగం కలిగిచొద్దు

22-08-2025 02:13:51 AM

సంకల్ప్ ఫౌండేషన్ డైరెక్టర్ రోజీ

ఖైరతాబాద్, ఆగస్టు 21 (విజయక్రాంతి) : రాష్ట్రంలో 18 ఏళ్ల లోపు పిల్లల హక్కులకు భంగం కలిగిస్తే సహించబోమని, వారికి న్యాయం దక్కేవరకు పోరాడుతామని సంక ల్ప్ ఫౌండేషన్ డైరెక్టర్ రోజీ తెలిపారు . ఇం దుకోసం అన్ని జిల్లాల్లో బాల రక్షక్ ఫోరం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గురువారం  సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఫోరం ప్రతినిధులతో కలిసి ఆమె మాట్లాడారు. పిల్లలు పాఠశాలల్లో, హాస్టళ్లలో, తల్లిదండ్రుల వద్ద ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా తమను సంప్రదించవచ్చని తెలిపారు.

కొంతమంది దుర్మార్గుల కారణంగా చిన్నారులు హత్యాచారానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కూకట్పల్లిలో చిన్నారిని హత్య చేసిన వారిని రాష్ట్ర ప్రభుత్వం పట్టుకొని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం చిన్నారి చిత్రపటానికి నివాళులర్పించి సంతాపం తెలిపారు. కార్యక్రమంలో ఫోరం ప్రధానకార్యదర్శి భాస్కర్, అడ్వైజర్  శ్యామల, మెంబర్స్ లక్ష్మి, భాగ్య, వెంకటరమణ చారి, హిమబిందు, రామ లీల, పుష్పలత తదితరులు పాల్గొన్నారు.