calender_icon.png 23 August, 2025 | 12:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్టార్ హాస్పిటల్స్ స్టార్ సమ్మాన్ ప్రారంభం

22-08-2025 02:15:15 AM

హైదరాబాద్, ఆగస్టు 21(విజయక్రాంతి): ఆగస్టు 21న జరుపుకొనే ప్రపంచ సీనియర్ సిటిజెన్స్ డే సందర్భంగా, స్టార్ హాస్పిటల్స్ స్టార్ సమ్మాన్ సీనియర్ సిటిజెన్స్ హెల్త్ ప్రివిలేజెస్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించింది. దీని ద్వారా వృద్ధులకు గౌరవ ప్రదమై న, ఆప్యాయమైన, తక్కువ ఖర్చుతో కూడిన వైద్య సేవలు అందించడంతో పాటు, ముంద స్తు జాగ్రత్తలను, ప్రారంభ దశలో వ్యాధులను గుర్తించే అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ సందర్భంగా స్టార్ హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమేశ్ గూడపాటి గారు మాట్లాడుతూ.. ‘మన సంస్కృతిలో మనం ఈరోజు ఉన్న స్థాయికి రావడానికి పెద్దలే కారణం. వారిని గౌరవించడం కేవలం సంప్రదాయం మాత్రమే కాదు, అది మన కర్తవ్యమూ. స్టార్ సమ్మాన్ ద్వారా వృద్ధుల్లో ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవడం, అవసరమైతే సమయానికి సరైన చికిత్స అందించడం, అలాగే ప్రత్యేక రాయితీల ద్వారా వారి ఆర్థిక భారం తగ్గించడం మా ఉద్దేశం.

వృద్ధుల సంక్షేమం కోసం ఈ కార్యక్రమాన్ని ఎంతో శ్రద్ధతో రూపొందించాం’ అని పేర్కొన్నారు. స్టార్ హాస్పిటల్స్ గ్రూప్ సీఈవో డాక్టర్ రాహుల్ మెడక్కర్ మాట్లాడుతూ ‘స్టార్ హాస్పిటల్స్ ప్రత్యేకత  కుటుంబ విలువల ఆధారంగా పనిచేయడం. సీనియర్ సిటిజెన్స్ రోగులు మాత్రమే కాదు, వారు తల్లిదండ్రులు, మార్గదర్శకులు, ప్రేరణలకు మూలం. స్టార్ సమ్మాన్ ద్వారా ప్రత్యేక హెల్ప్‌డెస్క్, హెల్ప్‌లైన్, రాయితీలు మాత్రమే కాకుండా, వృద్ధులను సలహాదారులుగా మా కమిటీలో భాగస్వాములను చేస్తాం. ఇంటి దగ్గరే చికిత్స కోరుకునేవారికి తక్కువ ఖర్చుతో హోమ్ కేర్ సదుపాయాలు కూడా అందిస్తాం’ అని పేర్కొన్నారు.