ఢిల్లీ కోర్టులో సత్యేంద్ర జైన్‌పై కేసు కొట్టివేత
- ఇది అసత్యంపై సత్యం గెలుపు
- ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ ఇన్చార్జి కన్వీనర్ దిడ్డి సుధాకర్
ముషీరాబాద్,ఆగస్టు 6(విజయక్రాంతి): నిజాయితీ ఎప్పటికీ గెలుస్తుంది... బిజెపి ఎన్ని కుట్రలు చేసినా.. ఎన్ని కుతంత్రాలు పన్నినా.. బీజేపీకి ప్రత్యామ్నాయంగా మారి న ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై సిబిఐ ద్వారా అవినీతి ఆరోపణలు చేసినా... సత్యం (ఆమ్ ఆద్మీ) గెలుపును ఎవరు ఆపలేరని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ కన్వీనర్ దిడ్డి సుధాకర్ పేర్కొన్నారు.
ఈ మేరకు బుధవారం ఢిల్లీ మాజీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ పై సిబిఐ చేసిన అనైతిక, అసాధారణ రెండు సంవత్సరాల శిక్షకు నిరసనగా లోయర్ ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద మూతులకు నల్లగుడ్డ కట్టి ప్ల-కార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రెడ్డి సుధాకర్ మాట్లాడుతూ అసత్య ఆరోపణల కేసు నుండి ఆప్ సత్యేంద్ర జైన్ కు ఢిల్లీ కోర్టు క్లీన్ చిట్ హర్షణీయమన్నారు. సిబిఐ అధికారులపై సత్యేంద్ర జైన్ న్యాయపోరాటం చేశారు.
సాక్ష్యాధారాలను సమర్పించ డంలో సీబీఐ విఫలమైందని, ఎవరినైనా అర్టెస్ చేయాలంటే అనుమానం ఉంటే సరిపోదని తదుపరి చర్యలకు నేరానికి పాల్పడ్డా రని అనడానికి బలమైన ఆధారాలు ఉండాల’ని కోర్టు తెలిపిందన్నారు. దీంతో బీజేపీ అంటే ‘బురద జల్లే పార్టీ అని‘ స్పష్టమవుతుందని అన్నారు. మాజీ రాష్ట్ర అధ్యక్షులు బుర్ర రాము గౌడ్, రాష్ట్ర నాయకులు విజ య మల్లంగి మాట్లాడుతూ ఎన్నో నిందలు మా నాయకుల పైన మోపారన్నారు.
అయి నా ఎప్పుడు మేము చెక్కుచెదరలేదని, ఎప్పు డు బిజెపికి భయపడలేదన్నారు. వారి ప్రలోభాలకు లొంగలేదు కాబట్టి ఈరోజు నిజా యితీగా బయటకి రాగలిగామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కోర్ కమిటీ సభ్యు లు మహమ్మద్ మజీద్, మాజీ మహిళా అధ్యక్షురాలు హేమా జిల్లోజు, మాజీ అధికార ప్రతినిధి జావేద్ షరీఫ్, ఎం శివాజీ, కొడంగల్ శ్రీనివాస్, రాకేష్ సింగ్, వివేక్, మౌనిక, లియాఖత్ఖాన్, జిశాన్ నెహ్రీ పాల్గొన్నారు.






