07-08-2025 01:32:24 AM
దిల్‌సుఖ్‌నగర్ ఆగస్టు 6 (విజయక్రాంతి) : ఉమ్మడి నల్లగొండ జిల్లా అమ్మన బోలు జడ్పీహెచ్‌ఎస్‌లో తమతో పాటు చదివి పోలీసు శాఖలో ఉన్నత ఉద్యోగంలో విధులు నిర్వర్తిస్తున్న సీఐ సైదులు ఇటీవల హైదరాబాద్ చైతన్యపరి పోలీస్టేషన్‌లో ఎస్ హెచ్‌ఓగా బాధ్యతలు చేపట్టారు. దీంతో అతని స్నేహితులు కె.కృష్ణారెడ్డి, పి.రవి, కె. చిన్నరమేశ్ వి.సురేందర్, గిరిరాజు, కొమ్ము యాదగిరి, ఎం.రవికుమార్ లు బుధవారం ఎస్‌హెచ్‌ఓ సైదులును కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రజలకు మరిన్ని సేవలు చేయాలని సైదులును అభినందిస్తూ, శుభాకాంక్షలు తెలిపారు.