06-07-2025 08:46:11 PM
వాజేడు (విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District) వాజేడు మండల పరిధిలో గల జగన్నాధపురం వై జంక్షన్ లో స్థానిక ఎస్సై జక్కుల సతీష్(SI Jakkula Satish) ఆదివారం ముమ్మరంగా వాహన తనిఖీ చేపట్టారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర మంత్రులు, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, వ్యవసాయ శాఖ, మార్కెటింగ్, కోపరేషన్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన నేపథ్యంలో వాజేడు మండలంలో భద్రత కట్టుదిట్టం చేశారు. కాగా, ఆదివారం వరంగల్, చత్తీస్గడ్ 163వ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ప్రతి వాహనమును క్షుణ్ణంగా పరిశీలించారు. వాహన పత్రాలు డ్రైవింగ్ లైసెన్సులు, పరిశీలించి వాహనదారులు వెళ్తున్న గమ్యస్థానాలను అడిగి తెలుసుకున్నారు. వాహన పత్రాలు సరిగా లేని వారిని మందలించి వదిలేశారు. ఈ కార్యక్రమంలో సివిల్, సిఆర్పిఎఫ్ పోలీసు బలగాలు పాల్గొన్నాయి.