06-07-2025 08:31:00 PM
బెజ్జంకి: శ్రీ బెజ్జంకి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ(Sri Lakshmi Narasimha Swamy Temple) సమీపంలో బెజ్జంకి గరుడ విగ్రహ కమిటీ యువకుల చేత తొలి ఏకాదశి ఆదివారం రోజు విగ్రహ భూమి పూజ నిర్వహించారు. ఆలయ చైర్మన్ ప్రభాకర్(Chairman Prabhakar) మాట్లాడుతూ... ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ విగ్రహం తెలంగాణలోనే మొదటి విగ్రహం కావచ్చు అని బెజ్జంకి నరసింహ క్షేత్రం వర్ధిల్లాలని ఇక్కడి యువత ముందుకు రావడం చాలా సంతోషకరమైనదాని నరసింహ క్షేత్రాన్ని అభివృద్ధి చేయించాలని, ఈ విగ్రహము తిరుపతిలో, కాకినాడలో అన్నాదని ప్రస్తుతం బెజ్జంకి నరసింహస్వామి క్షేత్రంలో ఏర్పాటు చెయ్యటం విశేషం అని అన్నారు. కార్యక్రమంలో ఆలయ పాలకవర్గ సభ్యులు, ప్రధాన ఆచార్యులు విగ్రహ కమిటీ సభ్యులు, విగ్రహ శిల్పులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.