calender_icon.png 7 July, 2025 | 3:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అఖిలపక్ష రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల రౌండ్ టేబుల్ సమావేశం

06-07-2025 08:54:10 PM

మునగాల: కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిరంకుషత్వంగా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయస్థాయిలో జులై 9న నిర్వహించ తలపెట్టిన సార్వత్రిక సమ్మె(General Strike)ను జయప్రదం చేయాలని మునగాల అఖిలపక్ష రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఐక్యవేదిక అఖిలపక్ష సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.

ఆదివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో సిపిఎం పార్టీ(CPM Party) నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న అఖిలపక్ష రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకుల రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు, మాట్లాడుతూ... వందేళ్లు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి యాజమాన్యాలకు, పెట్టుబడిదారులకు మేలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ లుగా మార్చిందన్నారు. కార్మిక వర్గానికి నష్టదాయకమైనటువంటి కార్మికుల శ్రమ శక్తిని కారుచౌకగా పెట్టుబడిదారులకు దోచిపెట్టి కార్మికులను కట్టు బానిసలుగా నిలబెట్టేందుకు రూపొందించిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని కోరారు.

కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను అలాగే కార్పొరేట్ అనుకూల, మతోన్మాద చర్యలను మరింత దూకుడుగా అమలు చేస్తుందని తెలిపారు. జూలై 9న నిర్వహించే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో మండల వ్యాప్తంగాకార్మిక వర్గం, అఖిలపక్ష రాజకీయ పార్టీలు ప్రజాసంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలనివారు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మునగాల పిఎసిఎస్ చైర్మన్ బిఆర్ఎస్ నాయకులు కందిబండ సత్యం, కాంగ్రెస్ పార్టీ నాయకులుమార్కెట్ కమిటీ డైరెక్టర్ కాసర్ల కోటయ్య, సిపిఐ మండల కార్యదర్శి చిల్లంచర్ల ప్రభాకర్, రైతు సంఘం జిల్లా నాయకులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, ఐఎన్టియుసి నియోజకవర్గ అధ్యక్షుడు కాసర్ల శ్రీనివాస్, వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా నాయకులు సిహెచ్ సీతారాం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొలిశెట్టి బుచ్చి పాపయ్య, సిఐటియు మండల కన్వీనర్ బచ్చరకూరి స్వరాజ్యం, ఏఐటీయూసీ మండల కార్యదర్శి సారెడ్డి రాఘవరెడ్డి, రైతు సంఘం జిల్లా నాయకులు ఎస్కే సైదా, చందా చంద్రయ్య, స్టాలిన్ రెడ్డి,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు జానయ్య,రామకృష్ణారెడ్డి, సిపిఐ పట్టణ కార్యదర్శి జక్కుల వీరశేఖర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జి శివ, వెంకటేష్, డివైఎఫ్ఐ మండల అధ్యక్ష కార్యదర్శులు సురేందర్, గడ్డం వినోద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొమ్ము ఈదరావు, చింతకాయల నాగరాజు, ఐఎన్ టియుసి మండల అధ్యక్షుడు పచ్చిపాల శ్రీనివాస్, నాగార్జున చారి, ఏఐటీయూసీ ఎలక్ట్రిసిటీ యూనియన్ మహేష్, కరుణాకర్, హమాలి వర్కర్స్ యూనియన్ అనంతు మైసయ్య గౌడ్, భవన నిర్మాణ కార్మిక సంఘం అల్లినాగరాజు, ఆర్ఎంపీ డాక్టర్స్ యూనియన్ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.