calender_icon.png 7 July, 2025 | 12:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మతసామరస్యానికి ప్రతీక మొహర్రం

06-07-2025 08:39:56 PM

ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి..

వలిగొండ (విజయక్రాంతి): మొహర్రం పర్వదినం మతసామరస్యానికి ప్రతీకయని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి(MLA Kumbam Anil Kumar Reddy) అన్నారు. ఆదివారం వలిగొండ మండల కేంద్రంలోని పీర్ల కొట్టం వద్ద, టేకుల సోమవారంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మొహర్రం పర్వదినాన్ని ముస్లిం సోదరులు, హిందువులు అందరూ కలిసి జరుపుకోవడం మంచి పరిణామం అని అన్నారు. మొహరం పర్వదినాన్ని గ్రామాల్లో ముస్లింలు హిందువులు పీర్లను ప్రత్యేకంగా అలంకరించి దట్టిలను సమర్పిస్తూ మొక్కులను తీర్చుకుంటూ పేర్లను ఊరేగిస్తూ చిన్న, పెద్ద అంతా కలిసి జరుపుకోవడం గొప్ప సాంప్రదాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.