calender_icon.png 7 July, 2025 | 1:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధి కమిటీ ఎన్నిక

06-07-2025 08:34:52 PM

అధ్యక్షుడిగా చింత శ్రీనివాసరావు..

ప్రధాన కార్యదర్శిగా మంద సరోత్తం రెడ్డి..

హనుమకొండ (విజయక్రాంతి): హనుమకొండ ఎన్జీవోస్ కాలనీ రోడ్డులోని కళ్యాణి ఫంక్షన్ హాల్ లో ఆదివారం గ్రేటర్ వరంగల్ 57వ డివిజన్ అశోక కాలనీలోని శ్రీప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ కమిటీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు బాల్నే రామయ్య, వెంకటేశ్వర్రావు, సోమేశ్వర్రావు ఆధ్వర్యంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా చింత శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా మంద సరోత్తంరెడ్డి, కోశాధికారిగా వింజమూరి సుధాకర్ స్వామి లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో అశోక కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మందల కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి బూర రాంచందర్రావు, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.