17 April, 2026 | 4:13 AM

సంధ్య కన్వెన్షన్ శ్రీధర్ రావుపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

20-06-2025 12:00 AM

శ్రీధర్ రావుతోపాటు వెంకటేష్ మరో ముగ్గురి అనుచరులపై కేసు నమోదు

శేరిలింగంపల్లి, జూన్ 19: సంధ్య కన్వెన్షన్ శ్రీధర్ రావుతో పాటు వెంకటేష్ మరో ముగ్గురిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైయ్యాయి. హైడ్రా అధికారులు ఎఫ్సిఐ కాలనీలో రోడ్డు మార్కింగ్ చేస్తుండగా కుషిచంద్ వడ్డే అనే బాధితుడు అక్కడకు చేరుకున్నాడు.

ఈ క్రమంలో శ్రీధరరావు అనుచరుడు వెంకటేష్ హైడ్రా పోలీసుల సమక్షంలోనే అత్యంత వేగంగా కారు నడిపి కుశిచంద్ వడ్డే ను ఢీకొట్టబోయాడు. అయితే భయానికి గురైన కుశిచంద్ తిరిగి వెళ్ళిపోయే ప్రయ త్నం చేయగా రోడ్డుపై కేటిఎమ్ బైక్ నం TS36 1085 వాహనంపై వచ్చి అతని అనుచరులతో కారుపై రాళ్ల దాడి చేయించాడని పోలీసులకు పిర్యాదు చేశాడు.

సంధ్య కన్వెన్షన్ శ్రీధర్ రావు అతని అనుచరుడైన వెంకటేష్ ఆదేశాల ప్రకారమే నాపై దాడి చేశారని కుశిచంద్ తెలిపాడు. భవిష్యత్తులోను సంధ్య కన్వెన్షన్ శ్రీదర్ రావు నుండి తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులకు తెలిపిన పిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.