calender_icon.png 17 December, 2025 | 9:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలిక అదృశ్యంపై కేసు నమోదు

17-12-2025 08:50:51 PM

వేములవాడ/చందుర్తి (విజయక్రాంతి): వేములవాడ నియోజకవర్గం, చందుర్తి మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలిక అదృశ్యమైన ఘటనపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టినట్లు చందుర్తి ఎస్సై రమేష్ తెలిపారు. ఎస్సై వివరాల ప్రకారం.. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన పిట్ల లక్ష్మి-అంజయ్య దంపతుల కుమార్తె మంగళవారం ఉదయం ఇంటి నుండి బయలుదేరి బస్సులో వేములవాడ వైపు వెళ్లింది. అయితే ఆమె తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు పరిచయస్థుల వద్ద విచారించినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. దీంతో బాలిక తల్లి లక్ష్మి చందుర్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు అదృశ్య కేసుగా నమోదు చేసి బాలిక ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేష్ తెలిపారు.