calender_icon.png 17 December, 2025 | 11:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోటపల్లి మండలంలో ప్రశాంతంగా ఎన్నికలు

17-12-2025 09:32:38 PM

- 89.65 శాతం పోలింగ్

కోటపల్లి, (విజయక్రాంతి): చెన్నూర్ నియోజకవర్గంలోని కోటపల్లి మండలంలో 31 గ్రామ పంచాయతీలుండగా రెండు ఏకగ్రీవం కాగా 29 జీపీలకు, 258 వార్డులుండగా 58 ఏకగ్రీవం కాగా, ఒక వార్డుకు నామినేషన్ దాఖలు కాకపోవడంతో 199 వార్డులకు బుధ వారం ఎన్నికలు నిర్వహించారు. 29 జీపీలకు 110 మంది, 199 వార్డులకు 522 మంది పోటీపడ్డారు. మండలంలో 25,941 (12,797 పురుషులు, 13,142 మహిళలు, ఇద్దరు ఇతరులు) మంది ఓటర్లుండగా ఉదయం తొమ్మిది గంటల వరకు 7,426 (28.63%), 11 గంటల వరకు 17,561 (67.70%), మధ్యాహ్నం ఒంటి గంట వరకు 22,303 (85.98%) పోలింగ్ జరిగింది. ఒంటి గంట తర్వాత పోలింగ్ కేంద్రాలలో క్యూలో నిలబడ్డ వారు ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత 23,255 (89.65%) ఓట్లు పోలయ్యాయి. 

ఒక్క ఓటుతో వెంకటి గెలుపు...

మండలంలోని రాజారం గ్రామ పంచాయతీ సర్పంచు అభ్యర్థులకు సమానమైన ఓట్లు రాగా ఎన్నికల అధికారులు రీ కౌంటింగ్ నిర్వహించారు. బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి తాటి రాజాగౌడ్ కు 361 ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీ బలపర్చిన చేన్నెల్లి వెంకటికి సైతం 361 ఓట్లు వచ్చాయి. ఇద్దరికి సమానమైన ఓట్లు రావడంతో మరోసారి కౌంటింగ్ మొదలు పెట్టారు. ఒక్క ఓటుతో కాంగ్రెస్ అభ్యర్థి వెంకటి విజయం సాధించారు. 

సర్పంచులు వీరే...

మండలంలో 31 గ్రామ పంచాయతీలుండగా లక్మ్షీపూర్ గ్రామ పంచాయతీ సర్పంచుగా పానం మల్లీశ్వరీ (కాంగ్రెస్), ఎసన్ వాయి సర్పంచుగా మారుపాక రజిత (కాంగ్రెస్)లు ఏకగ్రీవం ఎన్నికయ్యారు.

జనగాం గ్రామ పంచాయతీ సర్పంచుగా మర్రిశెట్టి పద్మ (కాంగ్రెస్), కొండంపేట సర్పంచుగా ఆరె వెంకటమ్మ (కాంగ్రెస్), కోటపల్లి సర్పంచుగా ఆలూరి సంపత్ (కాంగ్రెస్), పంగిడి సోమారం పోలం రాకేష్ యాదవ్ (కాంగ్రెస్), రొయ్యలపల్లి సర్పంచుగా సల్పల పురుషోత్తం (కాంగ్రెస్), రాజారాం సర్పంచుగా చెన్నెల్లి వెంకటి (కాంగ్రెస్), ఎడగట్ట సర్పంచుగా దొంగిరి రాజేశ్వరి (కాంగ్రెస్), బబ్బెరచెల్క సర్పంచుగా మూల ప్రదీప్ రెడ్డి (కాంగ్రెస్), బొప్పారం సర్పంచుగా కనుకుల సమ్మక్క (కాంగ్రెస్), నాగంపేట సర్పంచుగా విశాల్ (కాంగ్రెస్), పిన్నారం సర్పంచుగా పొన్నాల తిరుపతి (కాంగ్రెస్), శెట్ పల్లి సర్పంచుగా మంత్రి గోపి (కాంగ్రెస్), మల్లంపేట సర్పంచుగా తాళ్ల వెంకటమ్మ (కాంగ్రెస్), ఆలుగాం సర్పంచుగా మారిశెట్టి మొండక్క వెంకట స్వామి (కాంగ్రెస్), ఏదులబందం సర్పంచుగా గంట బాపు (కాంగ్రెస్), దేవులవాడ సర్పంచుగా దుర్గం సమ్మక్క (కాంగ్రెస్), పులగాం సర్పంచుగా కావేరి సమ్మయ్య (కాంగ్రెస్), రాపన్ పల్లి సర్పంచుగా అట్టెల ప్రభాకర్ (కాంగ్రెస్ రెబల్), కొల్లూర్ సర్పంచుగా సైదుల బుద్దమ్మ (బీఆర్ఎస్), రాంపూర్ సర్పంచుగా మనుమండ్ల రమేష్ (బీఆర్ఎస్), సర్వాయిపేట సర్పంచుగా గుగ్లోత్ రాజేష్ నాయక్ (బీఆర్ఎస్), నక్కలపల్లి సర్పంచుగా కంకణాల సంపత్ రెడ్డి (బీఆర్ఎస్), వెల్మపల్లి సర్పంచుగా మారిశెట్టి శ్యామల మల్లయ్య (బీఆర్ఎస్), పార్ పల్లి సర్పంచుగా తొగరు శ్రీనివాస్ (బీఆర్ఎస్), సిర్సా సర్పంచుగా గుడిసెల పోషక్క (ఇండిపెండెంటు), లింగన్నపేట సర్పంచుగా కొండగుర్ల లావణ్య (ఇండిపెండెంటు), సూపాక సర్పంచుగా కాశెట్టి సతీష్ (ఇండిపెండెంటు), వెంచపల్లి సర్పంచుగా పడాల రవళి (ఇండిపెండెంటు), అన్నారం గ్రామ సర్పంచుగా మొతె లక్ష్మీ (ఇండిపెండెంటు) ఎన్నికయ్యారు.