18 August, 2026 | 7:59 PM

Breaking News

సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త సర్వాయి పాపన్న గౌడ్   •   సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం   •   ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే ఫోకస్‌.. అధికారులకు క్లాస్‌   •   పాలిటెక్నిక్ విద్యార్థుల ర్యాలీ.. రాస్తారోకో   •   చెన్నూర్ లో ఘనంగా పాపన్న గౌడ్ జయంతి వేడుకలు   •   పశు పోషణ యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కార్యక్రమం   •   సేంద్రియ వ్యవసాయంతో లాభాలు   •   ఈనెల 19న జిల్లాకు ఎస్టీ, ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య   •   ఘనంగా సర్వాయి పాపన్న జయంతి వేడుకలు   •   అర్జున అవార్డులకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు   •  

నకిలీ విత్తనాలు అమ్మితే కేసులు నమోదు

18-06-2026 03:45 PM

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు.

తుంగతుర్తి (విజయక్రాంతి): రైతులను నమ్మించి నకిలీ విత్తనాలమ్మితే కేసులు నమోదు చేస్తామని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎం ఎన్ ఏ పి ద్వారా రైతులకు కందులు పెసరి జీలుగు విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆరు కాలం కష్టపడి పండిస్తేనే, మనందరి కడుపు నిండితయని, వారిని మోసం చేసే మాత్రం క్షమించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. గ్రామాల్లో రైతులకు నకిలీ విత్తనాలు లేకుండా సంబంధిత ఏవో ఏఈలు చొరవ చూసుకోవాలని, లేనియెడల చర్యలు తీసుకుంటామని అన్నారు.

నియోజకవర్గ పరిధిలోని నూతనకల్లో ఓ వ్యక్తి 20 బ్యాగులు నకిలీ విత్తనాలు అమ్మినట్లు తెలిసి తక్షణమే  ఫోన్లో పోలీస్ శాఖను చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ కోరారు. వాతావరణ పరిస్థితులు సరిగా లేనందున, పంట మార్పిడి విధానం ద్వారా పంటలు పండించుకోవాలని కోరారు. గత సంవత్సరం ఆయా మండలాల్లో ఎన్ని టన్నుల యూరియా కొనుగోలు చేశారో అధికారుల ద్వారా తెలుసుకున్నారు. గ్రామాల్లో చిరుధాన్యాల పంటల పై అధికారుల అవగాహన కల్పించాలని కోరారు. అనంతరం వెంపటి గ్రామానికి చెందిన ఉద్యమకాడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు భాష బోయిన వెంకన్న పుట్టినరోజును ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించగా శాలువాతో సన్మానించారు.

కార్యక్రమంలో వ్యవసాయ సంచాలకులు రమేష్ బాబు, రైతు కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్ పిఎసిఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు, పాలెపు చంద్రశేఖరు, నాగం జయసుధ సుధాకర్ రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, గ్రంథాలయ చైర్మన్ గంగరాజు యాదవ్ , మాచర్ల అనిల్, పెద్ద బోయిన అజయ్, దాసరి శ్రీను, మహేందర్ గౌడ్, వివిధ మండలాల ఏఈవోలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.