05-12-2025 08:23:25 PM
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మండలంలోని అన్ని గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని అర్వపల్లి ఎస్సై ఈట సైదులు అన్నారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతీఒక్కరూ ఎన్నికల నియమాలని పాటించాలని,అక్రమ మద్యం నిల్వలు ఉన్నట్లయితే కఠిన చర్యలు తప్పవని, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన శాంతి భద్రతలకు విఘాతం కల్గించినా ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేటట్లు ప్రజలు పోలీసు వారికి సహకరించాలని కోరారు.