ఎమ్మెల్యే స్వంత గ్రామ పంచాయతీ రాజురా సర్పంచ్ ఏకగ్రీవం...
05-12-2025 08:30 PM
బోథ్,(విజయక్రాంతి): బోథ్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సొంత గ్రామం రాజురా గ్రామ పంచాయతీలో సర్పంచ్, ఉప సర్పంచ్, 8 వార్డు మెంబర్లను గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్పంచ్ గా జాదవ్ స్వరాజి, ఉప సర్పంచ్ గా రాథోడ్ బాపురావు, వార్డు సభ్యులు మీరాబాయి రాథోడ్, జాదవ్ సంజుల, రెనా బాయి, అశోక్ జాదవ్, మెగాజీ, రాథోడ్ బాపురావు, అడ్లూరి సాయమ్మ, రాథోడ్ అమర్సింగ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన సర్పంచ్ ఉప సర్పంచ్ లను శుక్రవారం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తన స్వగృహంలో సత్కరించి, అభినందించారు.




